Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువచ్చే ఏడాది జన గణన..నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌

వచ్చే ఏడాది జన గణన..నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వదికాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నారు.
ఈసారి జనాభా లెక్కలతోపాటే కులగణనను కూడా చేపట్టనున్నారు. దీనికోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సెక్షన్‌ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad