Monday, May 5, 2025
Homeజాతీయంమేడారం, భద్రాచలంకు NH కనెక్టివిటీ: నితిన్‌ గడ్కరీ

మేడారం, భద్రాచలంకు NH కనెక్టివిటీ: నితిన్‌ గడ్కరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించనున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.  కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో సభావేదికపై నుంచి జాతీయ రహదారులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘నాగ్‌పుర్‌ నుంచి విజయవాడ కారిడార్‌ చేపట్టాం. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుంది. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. జగిత్యాల-కరీంనగర్‌ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతాం’’ అని నితిన్‌ గడ్కరీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -