నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్ ఎస్‌ఎస్-2024లో హైదరాబాద్‌లోని నిమ్స్ విద్యార్థి జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. వరసగా రెండో సంవత్సరం కూడా నిమ్స్ విద్యార్థియే అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి రికార్డు సృ ష్టించారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి గత సంవత్సరంలో తన సీనియర్లు స్థాపించిన విద్యా నైపుణ్య వారసత్వాన్ని కొనసాగించారు. నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన 12 మంది వైద్యులు అగ్రశ్రేణి ర్యాంకులను సాధించి, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సూపర్-స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం పొందను న్నారు. అత్యధిక విజయాలు సాధించిన వారి జాబితాలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1 ర్యాంక్), డాక్టర్ భానుచంద్ (9 ర్యాంక్), డాక్టర్ రోహిత్ (14), డాక్టర్ యు.సౌమ్య (21), డాక్టర్ సయ్యద్ ఖలీలుల్లా (43), డాక్టర్ కష్ణ కిషోర్ సోమాని (50), డాక్టర్ వి.సాయి స్పూర్తి (58), డాక్టర్ ధీరజ్ అనిరుధ్ (67), డాక్టర్ అమ్తుల్ రహీం సుర్యమ్ (361), డాక్టర్ పి.(361), పీఎస్‌ఎన్, రజిత (420), డాక్టర్ ఏవీఎస్ శ్రీలేఖ్య (456) ఉన్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన యువ వైద్యులను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి భీరప్ప, డీన్ లీజా రాజశేఖర్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి, సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, ప్రొఫెసర్ రామ్ మూర్తి, ఇతర వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్ బీఇఎంఎస్ )నిర్వహించే నీట్ ఎస్‌ఎస్- 2024, భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఆశావహులకు అత్యంత పోటీతత్వ ప్రవేశ పరీక్షల్లో ఒకటి. పరీక్ష జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, రేడియోడయాగ్నోసిస్, సైకియాట్రీ, అనస్థీషియాలజీ, ఈఎన్టీ, రెస్పిరేటరీ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ప్రసూతి, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌తో సహా 13 సూపర్-స్పెషాలిటీ స్ట్రీమ్‌లను విస్తరించింది.
నీట్ ఎస్‌ఎస్-2024లో నిమ్స్ విద్యార్థి డాక్టర్ జాకీర్ హుస్సేన్‌కు జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES