Tuesday, November 25, 2025
E-PAPER
Homeజిల్లాలు'లిక్కర్ రాణి`...'మహతల్లి`… అంటూ కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్

‘లిక్కర్ రాణి`…’మహతల్లి`… అంటూ కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్

- Advertisement -

నవతెలంగాణ వనపర్తి: వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కల్వకుంట్ల కవితకు దీటుగా బదులిచ్చారు. ‘నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్త’ అని కవిత హెచ్చరించిన నేపథ్యంలో, నిరంజన్ రెడ్డి ‘నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు. ప్రజలే నాపై ప్రేమతో అలా పిలుస్తారు. నీ టైటిల్ “లిక్కర్ రాణి”తో నువ్వు సంతోషంగా ఉండు.

తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎవరూ బోనం ఎత్తనట్టు.. ఆమె ఆడకుంటే బతుకమ్మ లేదన్నట్టు కవిత వ్యవహరించారని విమర్శించారు. ఆమె చర్యలతో కేసీఆర్‌ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, పార్టీకి నష్టం కలిగినా కేవలం కేసీఆర్ కుమార్తె అని ఒక్క మాట కూడా తాను మాట్లాడలేదని చెప్పారు.

కొందరు డూప్లికేట్‌ కాంగ్రెస్‌ నాయకులు పనిగట్టుకొని చేసిన అసత్య ఆరోపణలను ఆధారం చేసుకొని తనపై సంస్కారం లేకుండా మాట్లాడటం ఆమె విజ్ఞతకు నిదర్శనమన్నారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిపై కక్షపూరితంగా కేసులు పెట్టించలేదని చెప్పారు. 32 మంది బీసీలపై కేసులు పెట్టించిన వివరాలు ఉంటే మీడియాకు చూపించాలన్నారు. తహశీల్దార్‌ కార్యాలయానికి నిప్పు పెడితే.. రెవెన్యూ రికార్డులు ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఉంటాయని వాటిని ఎలా మార్చగలమని ప్రశ్నించారు. తాను హరీశ్‌రావు మనిషిని కాదని, వందశాతం కేసీఆర్‌ మనిషినని.. ఆయన ఆదేశాలను అమలు చేస్తానని చెప్పారు.

కేసీఆర్ కూతురివి కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాం. నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావ్’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -