నవతెలంగాణ-హైదరాబాద్: డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నేహల్ మోడీ అమెరికాలో అరెస్టు అయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తమకు అప్పగించాలని అభ్యర్థన మేరకు అమెరికాలో అతన్ని అరెస్టు చేసినట్లు ఈడీ, సీబీఐ అధికారులు శుక్రవారం ధృవీకరించారు.
కాగా, భారత్‌లో అతిపెద్ద కుంభకోణమైన 13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ మోసం కేసులో నేహల్ మోడీ ప్రమేయం ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా ఇడి వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. భారత అధికారులతో సమాచారం ఇవ్వడంతో తనని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నేహల్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మనీలాండరింగ్‌నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) 2002లోని సెక్షన్ 3 కింద, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120-బి 201 కింద నేరపూరిత కుట్ర నేరం కింద కేసు నమోదైంది. తన సోదరుడు నీరవ్ మోడీ బ్యాంకు మోసానికి పాల్పడి సంపాదించిన డబ్బును తారుమారు చేయడంలో నేహల్ కీలక పాత్ర పోషించినట్లు ఇడి విచారణలో తేలింది.