- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ‘వికసిత రాజ్యం కోసం వికసిత భారత్@2047’ అనే ఇతివృత్తంతో జరుగుతోంది. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -