నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరిగిపోతున్న గాలి కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు నగరవాసలును ఉక్కిబిక్కిరి చేస్తోంది. అయితే రచయిత ఉదయ్ మహూర్కర్ రాసిన ‘మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్ – రీడిఫైనింగ్ అన్‌లాయ్డ్ నేషనలిజం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల నుంచి ఢిల్లీ ఉండగా..చర్మ సంబంధ ఎలర్జీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ఎందుకు అంతా కాలుష్యమైందని ఆయన ప్రశ్నించారు.
శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా..? కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలి’’ అని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శిలాజ ఇంధనాలపై ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.



