Monday, November 17, 2025
E-PAPER
Homeజాతీయంనితిష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఖ‌రారు

నితిష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఖ‌రారు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లో ఎన్‌డిఎ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. నవంబర్‌ 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌నే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం జరగనున్న పలువురు మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి పాట్నాలోని గాంధీ మైదాన్‌ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
కాగా, సోమవారం ఉదయం ప్రస్తుత మంత్రి మండలి భేటీ కానుంది. నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయనున్నారు. నితీష్‌కుమార్‌ కూడా తన సిఎం పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు అందించనున్నట్లు జెడియు సీనియర్‌ నేత వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -