నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం అయిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు నడిపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీని నడిపించేందుకే నిశాంత్‌ను నితీష్ రాజకీయాల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. జేడీయూలో చేరిన సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ .. పార్టీని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన సొంత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం కోసం పనిచేస్తానని వెల్లడించారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో నితీష్ గెలవడం లాంఛనమే. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తర్వాత నితీష్ బిహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు.



