Saturday, March 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌తీయ చ‌మురు నౌక‌ల‌ను అడ్డుకోవ‌డంలేదు: ఇరాన్

భార‌తీయ చ‌మురు నౌక‌ల‌ను అడ్డుకోవ‌డంలేదు: ఇరాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా- ఇజ్రాయిల్ దాడుల‌తో హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తి మూసివేస్తున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప‌లు దేశాల నౌక‌ల‌కు మిన‌హయింపు ఇచ్చిన‌ట్లు తాజాగా వెల్ల‌డించింది. హోర్ముజ్ జ‌ల‌సంధిలో భార‌తీయ చ‌మురు నౌక‌ల‌(Indian Ships)ను అడ్డుకోవ‌డం లేద‌ని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి స‌యీద్ ఖ‌టిబ్‌జాదే తెలిపారు. ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న మాట్లాడారు. హోర్ముజ్ జ‌ల‌సంధిలో స్థిర‌త్వం కోసం ఇరాన్ ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. ఒక‌వేళ హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసివేస్తే దాని గురించి ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని ఇరాన్ మంత్రి వెల్ల‌డించారు. దౌత్యం ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -