నవతెలంగాణ-హైదరాబాద్: ఐటీ రిటర్నుల దాఖలుకు ఎలాంటి పొడిగింపు లేదని ఐటీ విభాగం స్పష్టం చేసింది. ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించినట్లు గుర్తు చేసింది. దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయని.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.
ఐటీ రిటర్ను దాఖలుకు నేడే (సెప్టెంబరు 15) చివరి తేదీ అని వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని సూచించింది. ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను మాత్రమే అనుసరించాలని తెలిపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తున్నదని, ముఖ్యంగా కాల్స్, లైవ్ చాట్స్, ఎక్స్ ద్వారా సమాధానాలు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐటీ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది.