నవతెలంగాణ-హైదరాబాద్: బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు నో-ఫ్లై జోన్ విస్తరించి ఉంది. డిసెంబర్ 6న 12:30 UTC నుండి డిసెంబర్ 8న 15:30 UTC వరకు ఈ నో – ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వులు చెప్పాయి.
నో ఫ్లై జోన్ బంగాళాఖాతంపై ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. ఇది క్షిపణి కార్యకలాపాల సమయంలో వాయు, సముద్ర భద్రతను నిర్ధారించడానికి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు ముందు భారత్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో 24 గంటల వ్యవధిలో మూడు అణ్వాయుధ సామర్థ్యం ఉన్న స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అయిన పృథ్వీ-II, అగ్ని-I, ఆకాష్ ప్రైమ్ క్షిపణులను ప్రయోగించారు.



