నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ మేరకు చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో “ఎర్రివ్- అలీవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.డీఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంలో పెట్రోల్ బంక్ యజమానుల పాత్ర కీలకమని తెలిపారు.
హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి పెట్రోల్ ఇవ్వకూడద(నో హెల్మెట్–నో పెట్రోల్)
సీట్ బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లకు ఇంధనం ఇవ్వకూడదు(నో సీట్ బెల్ట్–నో ఫ్యూయల్)
వాహనాల్లోనే పెట్రోల్,డీజిల్ నింపాలని బాటిళ్లు,క్యాన్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని సూచించారు.
ప్రతి పెట్రోల్ బంక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి,రోడ్డును కూడా కవర్ అయ్యే విధంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సబ్ ఇన్స్పెక్టర్లు యాదగిరి,కె.ఉపేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది,పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి తెలిపారు.



