Saturday, July 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇక ఆ రోజులు చెల్లవు

ఇక ఆ రోజులు చెల్లవు

- Advertisement -

– భారత్‌ ఉద్యోగులు వద్దు
– అమెరికా ఐటీ కంపెనీలపై ట్రంప్‌ మండిపాటు
– సాంకేతికతలో చైనాపై ఆధిపత్యం కోసం బ్లూప్రింట్‌ విడుదల
వాషింగ్టన్‌ :
అమెరికా టెక్‌ కంపెనీలపై దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మిస్తూ, భారత్‌ నుంచి ఉద్యోగులను తీసుకుంటూ అమెరికా స్వేచ్ఛ అందిస్తున్న ఆశీర్వాదాలు పొందుతున్నారని మండిపడ్డారు. ఇక ఆ రోజులు పోయాయని హెచ్చరించారు. వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్‌ ప్రసంగిస్తూ ‘చాలా కాలంగా అమెరికా టెక్‌ పరిశ్రమలో అధిక భాగం ప్రపంచీకరణను అనుసరిస్తోంది. ఇది లక్షలాది మంది అమెరికన్లలో అపనమ్మ కాన్ని కలిగిస్తోంది. తమకు వంచన జరుగుతోందని వారు భావిస్తున్నారు’ అని చెప్పారు. అమెరికా కు చెందిన బడా టెక్‌ కంపెనీలు చైనాలో తమ ఫ్యాక్టరీలను నిర్మించుకుంటూ భారత దేశంలో కార్మికులను నియమించు కుంటూ ఐర్లాండ్‌లో లాభాలను తగ్గించు కుం టున్నాయని ట్రంప్‌ ధ్వజమెత్తారు. అదే సమయంలో స్వదేశంలో తమ ఉద్యోగులను తొలగించడం, తగ్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇప్పుడు తాను దేశాధ్యక్షు డిని అయ్యానని, ఇక ఆ రోజులు పోయాయని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను అగ్రస్థానంలో ఉంచాలని సదస్సుకు హాజరైన టెక్‌ కంపెనీల అధిపతులను కోరారు. ఏఐ రేసులో గెలవాలంటే దేశభక్తిని నింపుకోవాలని, దేశానికి విధేయత చూపాలని ఉద్బోధిం చారు. ‘అమెరికా కోసం టెక్‌ కంపెనీలన్నీ కలిసి రావాలి. మీరు అమెరికాను అగ్రస్థానంలో నిలపాలని మేము కోరుకుంటున్నాము. మేము ఆశిస్తున్నది అదే’ అని అన్నారు. కాగా ట్రంప్‌ ప్రభుత్వం బుధవారం నూతన ఏఐ బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. క్లిష్టతరమైన సాంకేతిక పరిజ్ఞానంలో చైనాపై ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా పర్యావరణ నిబంధనలను సడలించింది. మిత్రదేశాలకు ఏఐ ఎగుమ తులను విస్తరించడమే ఈ బ్లూప్రింట్‌ లక్ష్యం. బ్లూప్రింట్‌ను విడుదల చేసిన సందర్భంగా ట్రంప్‌ ప్రసంగిస్తూ చైనాతో జరుగుతున్న సాంకేతిక ఆయుధ పోటీని వివరించారు. ఇది 21వ శతాబ్దాన్ని నిర్వచించే పోరాటమని తెలిపారు. ‘ఏఐ రేసును ప్రారంభించిన దేశం అమెరికాయే. ఈ రేసులో మనం గెలవబోతున్నామని దేశాధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మూడు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -