నవతెలంగాణ-హైదరాబాద్: కోర్టు పరిసరాల్లోకి న్యాయవాదులు తప్ప మరెవ్వరూ తెల్ల షర్టు, నల్ల ప్యాంటుతో రాకూడదు అని ఢిల్లీలోని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ నిషేదాజ్ఞలు విధించింది. కొందరు న్యాయవాదుల్లాగా తెల్ల షర్టు, నల్ల ప్యాంటులతో వచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లు కోర్టు గుర్తించింది. దీంతో న్యాయవాదులు తప్ప ఎవ్వరూ తెల్ల షర్టు, నల్ల ప్యాంటుతో కోర్టు పరిసరాల్లోకి రావద్దు అని నోటీసు జారీ చేసింది. కొంతమంది మధ్యవర్తులు తమను తాము న్యాయవాదులు లేదా వారి గుమస్తాలుగా చెప్పుకుంటూ …. మోసాలకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని కోర్టు తెలిపింది. దీంతో గుమస్తాలు, వ్యాజ్యాలు దాఖలు చేసేవారు, సాధారణ ప్రజలు ఎవరూ తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించకూడదని పేర్కొంది. అందుకే కోర్టు పరిసరాల్లోకి న్యాయవాదులు మాత్రమే అలాంటి దుస్తులు ధరించి రావాలని స్పష్టం చేసింది. గతంలో ఇలాంటి మోసాలను నివారించేందుకు న్యాయవాదుల గుమస్తాలకు ఐడీ కార్డులను జారీ చేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.
లాయర్లు తప్ప మరెవ్వరూ తెల్ల షర్టు, నల్ల ప్యాంటుతో రాకూడదు: రోహిణి కోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES