Wednesday, April 30, 2025
Homeజాతీయంచోక్సీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చోక్సీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కెనరాబ్యాంక్‌ కన్సార్టియమ్‌ మోసం కేసులో నిందితుడు మోహుల్‌చోక్సీకి ముంబయి కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆర్‌.బి.ఠాకూర్‌ బుధవారం ఈ ఆదేశాలిచ్చారు. వారెంట్‌పై నివేదిక కోసం ఈ అంశాన్ని జూన్‌ 2కి వాయిదా వేశారు. బెజెల్‌ జ్యువెలరీకి కన్సార్టియం ఒప్పందం కింద కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వరుసగా రూ.30 కోట్లు, రూ.25 కోటఉల వర్కింగ్‌ క్యాపిటల్‌ మంజూరు చేసినట్లు సిబిఐ పేర్కొంది. బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ మరియు అమ్మకం కోసం ఈ రుణాన్ని మంజూరు చేశారు. కానీ కంపెనీ ఆ రుణాన్ని ఆ ప్రయోజనాల కోసం వినియోగించలేదని తెలిపింది. రుణాన్ని తిరిగి చెల్లించలేదని, దీంతో కన్సార్టియంకు రూ.55.27 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది.
గీతాంజలి గ్రూప్‌ యజమాని అయిన చోక్సీ తన మేనల్లుడు నీరవ్‌ మోడి, ఆయన సోదరుడు నిషాల్‌ మోడితో కలిసి పిఎన్‌బికి రూ.13,500వేల కోట్ల పైగా కన్నం పెట్టారు. మోసం బయటపడటానికి ముందు 2018లో భారత్‌ను విడిచి పారిపోయారు. చోక్సీని పట్టుకునేందుకు ఏడేళ్లుగా భారత దర్యాప్తు ఎజెన్సీలు ప్రయత్ని స్తున్నాయి. ఈ ఆర్థిక నేరగాడి కదలికలపై నిఘా పెడుతూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు బెల్జియంలో అరెస్ట్‌ అయ్యేలా చేశారు. స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు చోక్సీ ప్రణాళిక వేస్తున్న సమయంలో ఏప్రిల్‌ 12న బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img