- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ఉగ్రవాద సంబంధాలున్న కారణంగా అరెస్టైన కొత్వాల్ నూర్ మహమ్మద్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నూర్ మహమ్మద్‌ను 3 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతినిస్తూ ధర్మవరం కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 27, 28, 29 తేదీల్లో నూర్ మహమ్మద్‌ను ధర్మవరం పోలీసులు విచారించనున్నారు. పాకిస్తాన్‌కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే.
- Advertisement -