Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమా విమానాలు ఒక్క‌టి కూడా దెబ్బ‌తిన‌లేదు: పాక్

మా విమానాలు ఒక్క‌టి కూడా దెబ్బ‌తిన‌లేదు: పాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేష‌న్ సిందూర్‌లో భాగంగా ఇటీవల భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ స్పందించారు.

భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదని ఆయన అన్నారు. తాము అంతర్జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించామన్నారు. మూడు నెలలుగా ఎలాంటి వాదనలు లేవని, ఇంత ఆలస్యంగా చేసిన వాదనలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ – 400 క్షిపణి వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయన్నారు. పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం సగానికి పైగా దెబ్బతిందని, కనీసం ఐదు యుద్ధ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయనే అంచనాకు వచ్చామని సింగ్ వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad