నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలోని పలు హోటల్స్ యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయి. అధిక రోజలు ఆహార పదార్థాలు నిల్వ ఉంచి..అమ్మకాలు చేస్తున్నా ఉదంతాలు పుడ్ సేప్టి అధికారుల సోదాల్లో వెలుగు చేసినా సంఘటనలు అనేకం. తాజాగా తమిళనాడులో ఓ హోటల్ నిర్వహకం వెలుగులోకి వచ్చింది.
చిల్లీ చికెన్ ‘ టేస్ట్‌ను అంతా ఇష్టపడుతుంటారు.. మరి గబ్బిలాల చిల్లీ చికెన్..! అవునండీ గబ్బిలాల చిల్లీ చికెన్ తాజాగా వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రంలో ”గబ్బిలాల” వేట కలకలం రేపుతోంది. గబ్బిలాలను చంపి, వాటిని సమీపంలోని హోటల్స్‌లో చిల్లీ చికెన్‌లా తయారు చేసి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అది గబ్బిలాల చిల్లీ చికెన్ అని తెలీక నిజమైన చికెన్ అనుకొని స్థానిక ప్రజలు తింటున్న సంగతి పోలీసుల విచారణలో తెలిసింది.
సేలం జిల్లా డేనిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తరచుగా తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నాయని డేనిష్ అటవీ శాఖ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. నిజంగానే వారికి ఆ ప్రాంతంలో తుపాకీల కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వారు అటవీ ప్రాంతమంతా గాలించారు. ఈ క్రమంలో అటవీ అధికారులకు కమల్, సెల్వం అనే ఇద్దరు కనిపించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు వారిద్దరినీ పట్టుకొని తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కమల్, సెల్వం ఇద్దరూ గబ్బిలాలను చంపి వాటిని వండి సాయంత్రానికి స్నాక్‌గా అంటే చిల్లీ చికెన్ అని చెప్పి అమ్ముతున్నారు.
వారిని మరింత లోతుగా విచారించగా… పల్లపట్టి ప్రాంతం సమీపంలోని ఓ చెట్టుపై లక్షలాది గబ్బిలాలు నివసిస్తున్నాయని, వాటిని వేటాడటానికి ప్రయత్నించామని, కానీ ఆ ప్రాంత ప్రజలు గబ్బిలాలను దేవతలుగా పూజిస్తుండటంతో వాటిని చంపడానికి అనుమతించలేదని, అందుకే అటవీ ప్రాంతంలోని గబ్బిలాలను వేటాడినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరినీ అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. గబ్బిలాల్లో డేంజర్ వైరస్‌లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటిది… ఆ ఇద్దరూ చిల్లి చికెన్‌కు అవసరయ్యే సైజులో ముక్కలుగా కోసి పంపుతున్నట్లు, మద్యం షాపుల వద్ద చికెన్ పడోడా రూపంలో విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
1993లో కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్‌లో ఇచ్చిన సూచనతో సహా న్యాయపరమైన ఉదాహరణలను ప్రస్తావించింది. ఏప్రిల్ 8న తెలంగాణ, పంజాబ్ తమిళనాడు రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు 201 కింద గవర్నర్లు మరియు రాష్ట్రపతి అధికారాలు మూడు వేర్వేరు అధికారిక తీర్పులకు లోబడి ఉన్నాయని పేర్కొంది.
”ఒక చట్టపరమైన అంశంపై సుప్రీంకోర్టు చట్టానికి లోబడి అధికార పరిధిలో నిర్ణయం వెల్లడించినపుడు .. నిర్ణయంపై ఏదైనా సందేహం ఉందని చెప్పలేము లేదా అది నిర్ణయం కాని విషయం అని చెప్పలేము. తద్వారా రాష్ట్రపతి ఈ ప్రశ్నపై చట్ట పరిధిలో వాస్తవ స్థానం ఏమిటో తెలుసుకోవాలి. చట్టపరమైన ప్రశ్నపై కోర్టు నిర్ణయం అన్ని కోర్టులు, అధికారులపై కట్టుబడి ఉంటుంది. అందువల్ల కోర్టు నిర్ణయం తీసుకోనపుడు మాత్రమే రాష్ట్రపతి చట్టపరమైన ప్రశ్నను సూచించగలరు ” అని కేరళ ప్రభుత్వం పేర్కొంది.
ఏప్రిల్ 8న తమిళనాడు గవర్నర్ కేసులో జస్టిస్ జె.బి.పార్థివాలా తీర్పులో, మే నెలలో రాష్ట్రపతి సూచనలో లేవనెత్తిన ప్రశ్నలను ఇప్పటికే వివరంగా ప్రస్తావించారని కేరళ ప్రభుత్వం హైలెట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8 తీర్పును సవాలు చేయాలనుకుంటే, సుప్రీంకోర్టులో సమీక్ష లేదా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసి ఉండాల్సిందని, రాష్ట్రపతి సూచన మార్గాన్ని ఎంచుకోకూడదని పేర్కొంది. ఏప్రిల్ 8 తీర్పుని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరలేదని, దానిని స్థిరమైన చట్టంగా నిర్థారించిందని పేర్కొంది. ”తమిళనాడు కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం సమీక్ష లేదా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు అంటే తీర్పును అంగీకరించింది. ఈ తీర్పు చెల్లుబాటు అయ్యే ఏ విచారణలోనూ దాడి చేయబడకుండా లేదా కొట్టివేయబడకుండా, అంతిమస్థితికి చేరుకుంది. అలాగే ఆర్టికల్ 141 కింద సంబంధిత వర్గాలకు కట్టుబడి ఉంటుంది. సూచన వంటి దాయాది సంబంధిత చర్యల్లో పరోక్షంగా సవాలు చేయబడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 144 ప్రకారం.. రాష్ట్రపతి, కేబినెట్ సుప్రీంకోర్టుకు అనుకూలంగా వ్యవహరించాలి” అని కేరళ ప్రభుత్వం వాదించింది.