Tuesday, May 20, 2025
Homeట్రెండింగ్ న్యూస్నేడు విచారణకు రావట్లేదు

నేడు విచారణకు రావట్లేదు

- Advertisement -

– ఈడీకి హీరో మహేశ్‌బాబు సమాచారం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ఎదుట తాను సోమవారం విచారణకు హాజరుకావటం లేదని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తెలియజేసినట్టు సమాచారం. సూర్య, సురానా డెవలపర్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించినందుకు గానూ మహేశ్‌బాబుకు రూ.5 కోట్లను కంపెనీలు చెల్లించాయనీ, ఆ సందర్భంగా మనీలాండరింగ్‌ వ్యవహారానికి పాల్పడ్డారని ఈడీ మహేశ్‌బాబుపై ఆరోపించింది. ఆ మేరకు కేసును నమోదు చేసిన ఈడీ అధికారులు.. వారం క్రితం ఈనెల 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. దానిపై స్పందించిన మహేశ్‌బాబు తనకు షూటింగ్‌ ఉండటం కారణంగా ఆ రోజు విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సమాచారమిచ్చినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -