నవతెలంగాణ-మల్హర్ రావు
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకే పరిమితమైన నోటా(నాన్ ఆఫ్ ఎబోవ్)కు పంచాయతీ ఎన్నికల్లోను చోటు దక్కింది. పైన పేర్కొన్న అభ్యర్థులు మాకు నచ్చలేదని ఓటర్లు తమ తీర్పు ఇచ్చే అవ కాశం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం కల్పించింది.వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా ఓటర్లకు ఏ అభ్యర్థి నచ్చకపోయినా నికచ్చిగా చెప్పాలంటే నోటా ఉండాలని ఎన్నికల కమీషన్ 2013లో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నోటాకు అవకాశం కల్పించింది.కానీ బ్యాలెట్ల ద్వారా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాకు చోటు కల్పించలేదు. ఈసారి ఎన్నికల్లో నోటాకు తొలిసారి ఎన్నికల సంఘం చోటు కల్పించింది. నోటాకు ఓటు వేసే అవకాశం ఉందని పంచాయతీరాజ్ అధి కారులు చెబుతున్నారు. ఏదేమైనా ఓటర్లు తమ తీర్పును స్పష్టం చేయడానికి గుర్తులతో పాటు నోటాకు చోటు కల్పించడంతో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లోనూ…నోటా.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

