Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeనిజామాబాద్జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలిప్యాకలో నోటుపుస్తకాల వితరణ కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలిప్యాకలో నోటుపుస్తకాల వితరణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలిప్యాకలో  జన్మదినాన్ని పురస్కరించుకుని జానకంపేటకు చెందిన శ్రీ అగ్గు వంశి  మానవతా దృక్పథంతో గొప్ప ఉదారతను చాటారు. ఆయన స్వయంగా పాఠశాలలోని విద్యార్థులకు నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సిరిల్ రావు , రిటైర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జంగం అశోక్ , ఉపాధ్యాయులు శ్రీ వినోద్, గంగాధర్, వెంకటరమణ, కృష్ణ వరప్రసాద్, దినేష్ , శ్రీమతి జ్యోతి మేడం గారు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యలో ప్రోత్సాహం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. అగ్గు వంశికి పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad