- Advertisement -
నవతెలంగాణ-చేర్యాల : ప్రభుత్వ గుర్తింపు లేకుండా మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న చేర్యాల పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు గురువారం నోటీసులు అందజేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రచ్చ కిష్టయ్య తెలిపారు. అదే విదంగా మరో ప్రయివేటు ఓక్లే పాఠశాలలో సీబీఎస్ఇ గుర్తింపు లేనప్పటికీ తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న ఆ పాఠశాలకు నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి మోసపోవద్దని తల్లిదండ్రులను కోరారు.
- Advertisement -