నవతెలంగాణ-హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. న్యాయసలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దానిపై అడ్వొకేట్ జనరల్‌తో, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్‌లో చేరలేదని ప్రకటించారు.
10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES