నవతెలంగాణ-హైదరాబాద్: IRCTC కుంభకోణంలో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు సోమవారం సిబిఐని ఆదేశించింది. అయితే ఈ దశలో విచారణను నిలిపివేయలేమని జస్టిస్ సూర్యకాంత శర్మ వ్యాఖ్యానించారు. కేసులో సిబిఐ వివరణను పరిశీలించకుండా ఆదేశాలు తీసుకోలేమని పేర్కొన్నారు. సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జనవరి 14కి వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్ 13న ట్రయల్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ సహా మరో 11మందిపై ఐపిసి కింద మోసం, నేరపూరిత కుట్ర మరియు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలను మోపింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.



