- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్‌లో నేషనల్ సెక్యూరిటీ గార్డు(NSG) కీలక పాత్ర పోషించనున్నాయని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరెక్టర్ జనరల్ బృగు శ్రీనివాసన్ అన్నారు. కేంద్ర బలగాలకు తోడుగా NSG మావోయిష్టుల ఏరివేతలో సమర్థవంతంగా పని చేస్తుందని ఆయన చెప్పారు. ఆ విధంగా ఎన్ఎస్‌జీని సన్నద్థం చేశామని, కేంద్ర బలగాలతో కలిసి పని చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర దళాలతో కలిసి పనిచేయడం, అవసరమైనప్పుడు ప్రత్యేక మద్దతు అందించడంలో NSG క్రియశీలంగా పని చేస్తుందని బృగు శ్రీనివాసన్ మంగళవారం జాతీయ మీడియా సమావేశంలో చెప్పారు.
- Advertisement -