Wednesday, October 15, 2025
E-PAPER
Homeహైదరాబాద్పాఠశాల ఆవరణంలో NSS వాలంటీర్స్ శ్రమదానం

పాఠశాల ఆవరణంలో NSS వాలంటీర్స్ శ్రమదానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఘట్కేసర్ మండలం కొర్రేముల గ్రామంలో మూడో రోజు సితాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్-1 వాలంటీర్లు శ్ర‌మ‌దానం నిర్వ‌హించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగనవాడి కేంద్రాలు డా.బిఆర్. అంబేద్కర్ త‌దిత‌ర ప్రాంతాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేప‌ట్టారు.

విద్యార్థుల సేవా భావంపై గ్రామ‌స్తుల‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ప్రశంసించారు. NSS వాలంటీర్లు సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ప్రధానోపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డా. కిషోర్, కృష్ణవేణి, రామకృష్ణ, Nss వాలంటీర్స్ ఈశ్వర్,సందీప్, నీలేష్, శ్రీనివాసులు, అరవింద్, బి సందీప్, గజానంద్, పృథ్వి రాజ్, జయరాజు, మహాలక్ష్మి, అరుణ, పూజ, సౌజన్య, దివ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -