నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : 56వ ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ యూఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ అస్పత్రిలో పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధి గా విచ్చేసిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళపెల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో పారదర్శకత, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. విద్యార్థుల ఫీజు సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ఉద్యమాలు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూఐ నాయకులు నోముల కమల్, జానకి రామ్, రాకేష్, ఆకాష్, రామ్ చరణ్ లు పాల్గొన్నారు.
ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


