Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ నిరాశ్రయులకు ఎన్‌టిటి డేటా క్రిస్మస్ కానుక

సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ నిరాశ్రయులకు ఎన్‌టిటి డేటా క్రిస్మస్ కానుక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఎన్‌టిటి డేటా ఇండియా డిజిటల్ ప్రైవేట్‌ లిమిటెడ్ (NTT DATA India Digital Pvt. Ltd.), ఈ ఏడాది కూడా తమ సేవా గుణాన్ని చాటుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సైనిక్‌పురి-యాప్రాల్‌లోని సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ నిరాశ్రయులకు అండగా నిలిచింది. వరుసగా మూడవ సంవత్సరం ఈ ఆశ్రమానికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసి, అక్కడి నివాసితుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది.
ఉద్యోగుల సమిష్టి కృషితో సాయం
సంస్థలోని ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాయం చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను సంస్థ అభినందించింది బ్రహ్మ బీరం (కంట్రీ హెడ్), కరోలిన్ హెస్సింగ్ (డైరెక్టర్ – హ్యూమన్ రిసోర్సెస్), నరేష్ పలేటి (డైరెక్టర్ – ఫైనాన్స్) వీరి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమం వల్ల ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలు పండుగను సంతోషంగా జరుపుకోగలుగుతారని ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరాశ్రయుల పునరావాసం కోసం సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఎన్‌టిటి డేటా యాజమాన్యం కొనియాడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -