నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసిపి నారాయణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ లతో కలిసి నగరంలోని వివిధ జంక్షన్ లలో ట్రాఫిక్ ఇబ్బందులను మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి కొత్త జంక్షన్ లను ప్రతిపాదించారు.
అదే విధంగా వినాయక్ నగర,బోధన్ రోడ్,గౌతం నగర్, హైద్రాబాద్ బైపాస్ ఏరియాలలో నీళ్ల జామ్ ను పరిశీలించి వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా నీళ్లు పోవడానికి పెద్ద నాళాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముగ్గురి వల్ల నగరంలో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.వీరి ఆధ్వర్యంలో జిల్లా, నగరం అభివృద్ధి చెందుతున్నందుకు జిల్లా, నగర ప్రజల తరుపున కేశ వేణు వారికి కృతజ్ఞతలు తెలిపారు.