- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఫలితాలను https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మార్కులనే విడుదల చేశామని, త్వరలోనే ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
- Advertisement -