Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘ఓ తంగేడు పూల త‌ల్లి బ‌తుక‌మ్మ’ పాట ఆవిష్క‌ర‌ణ‌

‘ఓ తంగేడు పూల త‌ల్లి బ‌తుక‌మ్మ’ పాట ఆవిష్క‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ‌తుక‌మ్మ‌ పండుగా సంద‌ర్భంగా రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ సార‌థ్యంలో ‘మ‌న బ‌తుక‌మ్మ‌- 2025 పేరిట‌ రూపొందించిన పాట ఇవాళ‌ విడుద‌ల కానుంది. కాగా, ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోను ప‌ర్యాట‌క శాఖ మంగ‌ళ‌వారం సామాజిక‌ మాద్య‌మ‌ల్లో పంచుకుంది. ప్ర‌ముఖ ప్ర‌జాక‌వి, గాయ‌కుడు, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న అద్భుత‌మైన సాహిత్యం అందించ‌గా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ‘ఓ తంగేడు పూల త‌ల్లి బ‌తుక‌మ్మ అంటూ’ సాగే ఈ పాట‌ల‌ను అదితి భ‌వ‌రాజ‌, మంగ్లీ, గోర‌టి వెంక‌న్న క‌లిసి పాడారు. ఈశ్వ‌ర్ పెంటి నృత్య రూప‌క‌ల్ప‌న చేశారు. తెలంగాణ ప‌ల్లె దృశ్యాలు, పండుగ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా ద‌ర్శ‌కులు బ‌ద్ర‌ప్ప గాజుల‌ అద్భుతంగా తెర‌కెక్కించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -