నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నూతన కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు. నూతన కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ ఒకరి తర్వాత ఒకరు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వారు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి సీఎం వారికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ తదితరులు నూతన కమిషనర్లను అభినందించారు.
ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణస్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES