Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ఓటర్ల జాబితాపై అభ్యంతరం

బీహార్‌లో ఓటర్ల జాబితాపై అభ్యంతరం

- Advertisement -

– సీఈసీకి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నీలోత్పల్‌ బసు లేఖ
న్యూఢిల్లీ:
బీహార్‌లో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా ముమ్మరంగా సవరించడానికి సం బంధించి అనుసరిస్తున్న పద్ధతి, ప్రక్రియ అభ్యం తరకరంగా వుందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు శుక్రవారం ఒక లేఖ రాశారు. ఓటర్ల జాబితాలను సమీక్షించ డమనేది సాధారణంగా, రొటీన్‌గా జరిగే ప్రక్రి య, కానీ, ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం లేదా చేర్చడం వంటి ప్రధాన బాధ్యతను ఓటర్లపైనే పెడుతున్నట్లుగా ప్రస్తుత ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. అదీ కాకుండా, ఈ సవరణ చేపట్టే సమయం కూడా ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు ఈ నెల 24న బీహార్‌ సీఈఓకు రాసిన లేఖనుద్దేశించి ఆయన మాట్లాడారు. తమ ఆందోళనలకు నిర్దిష్టంగా కొన్ని కారణాలు కూడా వున్నాయన్నారు.
ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను గమనంలోకి తీసుకుని వారి అభిప్రాయాలు సమీకరించి, అటు తర్వాత ఇసిఐ ఈ ప్రక్రియ చేపట్టాలి. అంతేకానీ కేవలం ఈ విషయం తెలియచేయడానికి లాంఛనంగా ఒక సమావేశం పెట్టరాదని బసు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కేవలం కొద్ది నెలల్లో ఎన్నికలు వున్నాయనగా ఇటువంటి విస్తృతమైన ప్రక్రియ చేపట్టడం వల్ల మొత్తం వాతావరణం కలుషితమవుతుంది, ప్రమాదాలతో నిండి వుంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి ఇచ్చిన కాలపరిమితి కూడా కేవలం ఒక్క నెలే. అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడమన్నది సంబంధిత బీఎల్‌ఓల బాధ్యత. సంబంధిత ప్రదేశంలో ఓటరుగా తనకున్న చట్టబద్ధమైన అర్హతను నిరూపించుకునే బాధ్యతను, భారాన్ని సామాన్యుడైన ఓటరుపై విధించరాదు. ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి విషయంలో ఇదే జరుగుతోంది. ప్రస్తుత ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారం ఇవ్వడంలో బీఎల్‌ఓ విఫలమైనట్లైతే, ఆ ఓటరుకు ఆ ఫారమ్‌ను తెచ్చుకునే ప్రక్రియ గురించి తెలియకపోతే, ఆ వ్యక్తి పేరు ఎన్నికల జాబితా నుండి తొలగించబడుతుంది. ఇంటర్‌నెట్‌ లేకపోవడం, దానికి సంబంధించిన నైపుణ్యాలతెలియకపోవడం, అసలు చదువుకున్న వారే కాకపోతే ఇక ఓటర్లకు ఆ ఫారాలను డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ చేయడం తెలుస్తుందని ఇసి ఎలా భావిస్తోందని నీలోత్పల్‌ బసు ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సిలా వుంది. ఇదంతాచూస్తుంటే ప్రత్యేకంగా ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవచ్చని, వారి పేర్లను ఓటర్లుగా తొలగించడానికిదారి తీయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25న బీహార్‌ సిఇఓ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మెజారిటీ రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకించినట్లు, వెంటనే ఈ ప్రక్రియను విడనాడాలని వారు కోరినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ పద్ధతినే రాబోయే ఎన్నికలకు కూడా వర్తింపచేసే అవకాశం వున్నందున దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యన్నారు. అందువల్లతక్షణమే భారత ఎన్నికల కమిషన్‌ ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -