- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం పై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు అవాంతరాలు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని, సమాఖ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ్ మౌలిక లక్షణమని, వైవిధ్యభరితమైన సంప్రదాయాలకు మోడీ ప్రభుత్వం తిలోదకాలు సృష్టిస్తుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రం రాష్ట్రాల గొంతును నొక్కుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పోస్టుకు మద్దతుగా రాహుల్ పెట్టారు.
- Advertisement -