Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజస్టిస్‌ వర్మ ఉద్వాసనకుతొలగిన అడ్డంకులు

జస్టిస్‌ వర్మ ఉద్వాసనకుతొలగిన అడ్డంకులు

- Advertisement -

పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ :
తనపై సుప్రీంకోర్టు నియమించిన న్యాయమూర్తులు జరిపిన విచారణను సవాలు చేస్తూ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం తోసిపుచ్చింది. దీంతో పార్లమెంటులో ఆయన అభిశంసనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో జస్టిస్‌ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో నగదు లభించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన న్యాయమూర్తుల బృందం ఆయనను తొలగించాలని సిఫారసు చేసింది. జస్టిస్‌ వర్మను పదవి నుంచి తొలగించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల విచారణకు న్యాయమూర్తులను నియమించడాన్ని జస్టిస్‌ వర్మ సవాలు చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, ఏజీ మసిV్‌ాతో కూడిన బెంచ్‌ వర్మ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయడం, కమిటీ పాటించిన పద్ధతులు చట్టబద్ధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. తనపై కమిటీ దర్యాప్తు జరపడం చట్టవిరుద్ధమన్న వర్మ వాదనను తోసి పుచ్చింది. ‘ఫొటోలు, వీడియోను అప్‌లోడ్‌ చేయడం మినహా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల కమిటీ నిబంధనలు పాటించాయి. ఫొటోలు, వీడియోను అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని మేం చెప్పాం. మీరు అప్పుడు దాన్ని సవాలు చేయలేదు’ అని బెంచ్‌ తెలిపింది. ప్రధానికి, రాష్ట్రపతికి సీజేఐ లేఖలు పంపడం రాజ్యాంగ విరుద్ధం కాదని అభిప్రాయ పడింది. కమిటీ ఏర్పాటును జస్టిస్‌ వర్మ ఎందుకు వ్యతిరేకించలేదని గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు బెంచ్‌ ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని భావించి ఉంటే దాన్ని వ్యతిరేకించాలి కదా అని అడిగింది. కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి పంపేముందు అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం తనకు ఇవ్వలేదన్న జస్టిస్‌ వర్మ వాదనతో బెంచ్‌ విభేదిస్తూ ఆ అవసరం లేదని తెలిపింది. పిటిషనర్‌ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జరిపే విచారణకు చట్టబద్ధత ఉంటుంది. అది రాజ్యాంగ చట్రానికి వెలుపల ఉన్న సమాంతర యంత్రాంగం కాదు’ అని చెప్పింది.
న్యాయమూర్తిని తొలగించాలని సిఫారసు చేసే అధికారం సుప్రీం కమిటీకి లేదని జస్టిస్‌ వర్మ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ అన్నారు. అది కేవలం ప్రధాన న్యాయమూర్తికి సలహా ఇవ్వడానికి మాత్రమే పరిమితమని చెప్పారు. ఇలాంటి చర్య రాజ్యాంగేతర యంత్రాంగానికి అవకాశం కల్పిస్తుందని వాదించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img