Monday, May 19, 2025
Homeఅంతర్జాతీయంజో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్

జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్

- Advertisement -


న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ కు ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) సోకినట్లుగా ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఇటీవలే ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రోస్టేట్‌లో ఓ చిన్న గడ్డను వైద్యులు కనుగొన్నారు. ఫిలడెల్ఫియా లోని ఆసుపత్రిలో శనివారం యూరిన్ సంబంధిత టెస్ట్‌లను నిర్వహించిన డాక్టర్లు రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి అది ప్రోస్టేట్ క్యాన్సరేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించిందని పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -