Thursday, September 18, 2025
E-PAPER
Homeజాతీయం‘అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారిక దర్యాప్తు చేప‌ట్టాలి’

‘అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారిక దర్యాప్తు చేప‌ట్టాలి’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ‘అధికారిక దర్యాప్తు’ చేపట్టాలని ఎయిర్‌ఇండియా డ్రీమ్‌లైనర్‌ పైలెట్లలో ఒకరైన కెప్టెన్‌ సుమీత్‌ సభర్వాల్‌ తండ్రి పుష్కరాజ్‌ సభర్వాల్‌ కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఎఎఐబి) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సుమీత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీంతో మరణం గురించి ఆలోచిస్తున్నాడని నివేదిక నుండి లీకైన సమాచారం తెలిపిందని, పౌరవిమానయాన కార్యదర్శి మరియు ఎఎఐబి డైరెక్టర్‌ జనరల్‌కు రాసిన లేఖలో పుష్కరాజ్‌ పేర్కొన్నారు. ఈ అసత్యాలు తన ఆరోగ్యం మరియు మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. ఇవి కెప్టెన్‌ సబర్వాల్‌ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం.. భారత పౌరుడికి హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు అని ఆగస్టు 29 నాటి లేఖలో పేర్కొన్నారు. విమానం (ప్రమాదాలు మరియు సంఘటనల దర్యాప్తు) నియమాలు, 2017లోని నిబంధన 12 ప్రకారం ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించాలని పుష్కరాజ్‌ డిమాండ్‌ చేశారు.
విమాన ప్రమాదానికి గురైన సమయంలో, అటువంటి దర్యాప్తు నిర్వహించడం సముచితమని అనిపిస్తే, ఆ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక దర్యాప్తును చేపట్టాలని కోరారు. ఈ లేఖపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఎఎఐబి నుండి ఈ లేఖపై స్పందన రాలేదు.

తన కుమారుడు మానసిక ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను కూడా ఆయన తోసిపుచ్చారు. సుమిత్‌ విడాకులు తీసుకున్నాడని, ఇటీవల ఆయన తల్లి మరణించారని, దీంతో ఆయనకు జీవితంపై నిరాశ చెందారని నివేదిక పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
ఈ లేఖపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఎఎఐబి నుండి ఈ లేఖపై స్పందన రాలేదు.

అహ్మదాబాద్‌ నుంచి జూన్‌ 12న లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ విమానం.. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకేఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -