Thursday, October 30, 2025
E-PAPER
Homeఖమ్మం21 అడుగులకు మున్నేరు..లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నఅధికారులు

21 అడుగులకు మున్నేరు..లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నఅధికారులు

- Advertisement -

– అర్ధరాత్రి పోలీసులు, అధికారుల హైఅలర్ట్
– పునరావాసానికి బొక్కల గడ్డ, మోతి నగర్ ప్రాంతాల ప్రజలు
– అర్ధరాత్రి పరిస్థితులను పరిశీలించిన నగర మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ- గాంధీ చౌక్ : ఖమ్మం అర్బన్- రూరల్ మండలాల మధ్య ఉన్న మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రి 7 గంటల వరకు 18 అడుగుల వద్ద ఉన్న మున్నేరు అర్ధరాత్రి 12 గంటలకు 21 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మోతి నగర్ ప్రాంతాల ప్రజలను ప్రత్యేక వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి వేళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్, కె.వి.ఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, కరుణగిరి ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని పలువురు తమ విలువైన వస్తువులను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. 24 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య అర్ధరాత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -