ఎరువులు అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు
నవతెలంగాణ – కాటారం
మండలంలో ఎరువుల సరఫరా పరదర్శకంగా.. జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు తెలిపారు. ఆయన మంగళవారం మహాదేవపూర్ ఏ డి ఏ శ్రీపాల్, కాటారం మండల వ్యవసాయ అధికారి పూర్ణిమతో కలిసి మండలంలోని పలు ఎరువుల దుకాణలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలలో ఉన్న యూరియ నిల్వలను fives యాప్ ద్వారా ధ్రువీకరించడంతో పాటు స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ విధానాలను పరిశీలించారు. ప్రభుత్వ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీలార్స్ కు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు టాలెత్తకుండా అవసరమైన మేరకు యూరియ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయలు జిరిగితే కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు. ఆయన వెంట సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు
- Advertisement -
- Advertisement -



