– గడ్డం వెంకటేష్, నూకల భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో వందల ఎకరాల వరి పంట నేలకు ఒరిగింది వెంటనే అధికారులు నిర్లక్ష్యం వీడి పంట నష్టపరిహాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం శనివారం, వారు మాట్లాడుతూ కాదూరి రాములు, గౌడ రాజు, ఎడపల్లి స్వరూప మల్లేష్ రైతుల పంట నేలకూరికి లక్షల రూపాయల నష్టం జరిగిందని కనీసం అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట పొలం అకాల వర్షంతో నేలకు ఒరగడంతో రైతులు నెత్తికి చేతులు పెట్టి దివాలా తీయవలసిన పరిస్థితి వచ్చిందని వారన్నారు.
ఒక గ్రామంలోనే ఇంత పంట నష్టం జరిగితే మండల వ్యాప్తంగా వేల ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం తప్ప నష్టం జరిగిన ప్రదేశానికి వచ్చి పంట నష్టం అంచనా వేసే పరిస్థితి అధికారుల వైపు నుండి కనబడడం లేదని, ప్రాథమిక అంచనా తో అంట నష్టం ఏ రకంగా అంచనా వేస్తారని ప్రశ్నించారు. మండల వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి వెంటనే పంట నష్టపోయిన ప్రదేశాలను సందర్శించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతే రాజు అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే కనీసం జిల్లా అధికారులు మండల అధికారులు పట్టించుకునే పరిస్థితి పంట నష్టం వేసే పరిస్థితి లేదని వారన్నారు వెంటనే అధికారులు అకాల వర్షంతో నష్టపోయిన పంటను అంచనావేసి పంట నష్టపరిహారం రైతులకు త్వరత గతిన అందేలా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, రైతులు స్వరూప, రాములు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.



