Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అర్హుడికి సొంత గృహం అందించే కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.శనివారం భూపాలపల్లి మండలంలోని రాంపూర్ గ్రామాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతిని,గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రాథమిక పాఠశాల,అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తరుణి ప్రసాద్,ఎంపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి దేవేందర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -