– ప్రజావాణిలో రైతు ఫిర్యాదు చేసిన రైతు
నవతెలంగాణ – కామారెడ్డి
సర్వే చేయించాలని రెండుసార్లు మీ సేవ కేంద్రంలో చలాన్లు చెల్లించినప్పటికీ అధికారులు స్పందించలేదని పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామానికి చెందిన గంగాని చిన్న నర్సింలు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సర్వే నంబర్ 841 / 23లో 2 ఎకరాలు 37 గుంటల భూమి ఉందని తెలిపారు. భూమి సర్వే చేయించాలని రెండు సార్లు మీ సేవలో చలాన్లు కట్టి, సంబంధిత దరఖాస్తులను పాల్వంచ ఎమ్మార్వో కార్యాలయంలో సమర్పించినట్లు పేర్కొన్నారు.
చలాన్లు చెల్లించి నాలుగు నుండి ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు సర్వే పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ ఒకసారి భూమి వద్దకు వచ్చి వెళ్లిపోయినప్పటికీ, సర్వే ప్రక్రియను పూర్తిచేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన భూమిలో తక్షణమే సర్వే నిర్వహించాలని గంగాని చిన్న నర్సింలు కోరారు.



