నవతెలంగాణ – చేర్యాల
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు,సిబ్బంది చిందులు వేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ భక్తిని చాటాల్సిన అధికారులే ప్రభుత్వ కార్యాలయంలో చిందులు వేయడం అధికారుల తీరుకు నిదర్శనమని చర్చించుకుంటున్నారు. పట్టణ ప్రజలు.ఊ అంటావా ఉఊ అంటావా అనే రక్తి కట్టించే పాటలతో మహిళ,పురుష అధికారులు ప్రభుత్వ కార్యాలయంలోనే చిందులు వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు సైతం కార్యాలయంలో చిందులు వేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివిధ పనులతో ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలను పలు కారణాలు చెబుతూ ఇబ్బందులకు గురి చేసే అధికారులు ఇలా ప్రభుత్వ కార్యాలయంలోనే చిందులు వేస్తూ కాలక్షేపం చేయడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులు,సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో అధికారుల చిందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES