- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 12 శాతం పైగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ 12.6 శాతం పెరిగి 76.61 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ 12.2 శాతం పెరిగి 77.77 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో చమురు రంగ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. BPCL షేర్లు 6.1 శాతం, IOCL షేర్లు 3.9 శాతం, HPCL షేర్లు 5.3 శాతం నష్టపోయాయి.
- Advertisement -