- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు తమ దోపిడీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. తెలంగాణ యప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) మంగళవారం ఈ సమ్మెను ప్రకటించింది. కంపెనీలు ఏకపక్షంగా చార్జీలు నిర్ణయిస్తూ, డ్రైవర్ల ఆదాయాన్ని దోచుకుంటున్నాయని, దీంతో వారు నష్టపోతూ అప్పులపాలవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు కనీస ఛార్జీలు నిర్ణయించడంలో విఫలమయ్యాయని, పెట్రోల్, డీజిల్, నిర్వహణ ఖర్చులను డ్రైవర్లపైనే వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె మరింత ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
- Advertisement -



