- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దుపై గందరగోళం నెలకొంది. పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాత జీవో విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారుల తప్పిందం వల్ల జరిగిందని పంచాయతీ శాఖ వివరణ ఇచ్చింది. తాజాగా కొత్త జీవోను విడుదల చేసింది.
కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారం జరిగింది. దీంతో గతంలో మాదిరిగానే సర్పంచులు, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీ చేసింది.

- Advertisement -



