Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంతిరంగా యాత్రలో పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా, మనోజ్‌ సిన్హా

తిరంగా యాత్రలో పాల్గొన్న ఒమర్‌ అబ్దుల్లా, మనోజ్‌ సిన్హా

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్: మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని దాల్‌ సరస్సు సమీపంలో జరిగిన తిరంగ యాత్రలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, గవర్నర్‌ మనోజ్‌ సిన్హాలు పాల్గొన్నారు. ఈ యాత్రలో వందలాది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఎంతోమంది అమరవీరుల త్యాగానికి చిహ్నం ఈ జెండా. అందుకే వేడుకలకు అతీతంగా జాతీయ జెండా గౌరవాన్ని పౌరులు నిలబెట్టాలి. దేశ సంక్షేమం కోసం నిలబడే ధైర్యం మనలో ఉంది. జాతీయ జెండాతో మన సంబంధం ఈ కార్యక్రమాలకే పరిమితం కాకూడదు. మన జెండా గుర్తింపును, దాని గౌరవాన్ని మనం కాపాడుకోవాలి’ అని ఆయన అన్నారు.
రాష్ట్ర గవర్నర్‌ మనోజ్‌ సిన్హా మాట్లాడుతూ.. ‘పహల్గామ్‌ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఆపరేషన్‌ సింధూర్‌, ఆపరేషన్‌ మహాదేవ్‌ల ద్వారా తమ ధైర్య సాహసాలను చాటిన సైనికులను, సాయుద దళాల అధికారులను జమ్మూ కాశ్మీర్‌ పోలీసులను అభినందిస్తున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -