Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామనవమి వేళ… అసంపూర్తిగా హనుమాన్ దేవాలయ నిర్మాణం

శ్రీరామనవమి వేళ… అసంపూర్తిగా హనుమాన్ దేవాలయ నిర్మాణం

- Advertisement -

– ఐదేళ్లుగా ముందుకు సాగని ఆలయ నిర్మాణపు పనులు
– ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు
నవతెలంగాణ నవాబుపేట : ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలు ఈ నెల 27న సమీపిస్తుండగా, నవాబుపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉండటం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. పండుగ శోభతో కళకళలాడాల్సిన ఆలయం నిర్మాణం ఐదేళ్లుగా ముందుకు సాగక అర్ధాంతరంగా నిలిచిపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.గతంలో పాత గుడిని కూల్చి కొత్త దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ, కొంతవరకే పనులు జరిగి తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. దాతల సహకారం, గ్రామస్థుల నుంచి వసూలైన నిధులు ఉన్నప్పటికీ నిర్మాణం ముందుకు సాగకపోవడం పట్ల భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే గుడి ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై, నిర్మాణ సామగ్రి దెబ్బతింటుండగా,అసంపూర్తి గుడిలో జంతువులు తిరుగుతున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాల్సి రావడం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది.ఇప్పటికైనా బాధ్యులు స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -