Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమరోసారి అపశృతి.. ముగ్గురు మృతి

మరోసారి అపశృతి.. ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున భారీ తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేటపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఇటీవలే రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపుతప్పి భక్తుల పైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమ పైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటినుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇది మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img